పన్ను వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు చర్యలు

జీఎస్టీ రిటర్న్స్‌ మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది

nirmala sitharaman
nirmala sitharaman

న్యూఢిల్లీ: పన్నుల వ్యవస్థను సులభతరంగా మార్చేందుకు, నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. సీఏఐటి మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీ రిటర్న్స్‌ మరింత మెరుగ్గా మార్చే దిశగా సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా పన్ను వ్యవస్థను సులభంగా మార్చే చర్యలు చేపడుతున్నామన్నారు. వీటి ఆధారంగా పన్నుల వ్యవస్థలో మార్పులు చేస్తామన్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలలో ముకరహిత ఎలక్ట్రానిక్‌ మదింపు పథకాన్ని ప్రారంభించామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. దీంతో పన్ను చెల్లింపుదారులకు, అధికారులకు మధ్య ఎలాంటి జోక్యం అవసరం లేకుండా ఆరికట్టామని, పారదర్శకంగా పన్నుల మదింపు జరిగేలా చేశామన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/