అసదుద్దీన్‌ ఓవైసికి, సిపి సజ్జనార్‌కు మధ్య ట్విట్టర్‌ వార్‌

హైదరాబాద్‌ అమెరికన్‌ కంపెనీల్లో జిహాదీలు పనిచేస్తున్నారంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌

V C Sajjanar & Asaduddin Owaisi
V C Sajjanar & Asaduddin Owaisi

హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసికి, సైబరాబాద్‌ సిపి సజ్జనార్‌కి మధ్య ట్విట్టర్‌ వేదికగా వార్‌ సాగింది. సిపి సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ అసద్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దిశ నిందితులను ఉదయం 5 గంటలకు ఎన్‌కౌంటర్‌ చేయడం దారణమన్నారు. బుల్లెట్లు కడుపులో దింపడం సరైంది కాదంటూ సజ్జనార్‌ను ప్రశ్నిస్తూ ఓవైసి ట్వీట్‌ చేశారు. అవసరమైతే అరెస్ట్‌ చేసి థర్డ్‌ డిగ్రీ ఇవ్వాలి అని సూచించారు. హైదరాబాద్‌ అమెరికన్‌ కంపెనీల్లో జిహాదీలు పనిచేస్తున్నారంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి సమాధానంగా సిపి సజ్జనార్‌ మరో ట్వీట్‌ చేశారు. దానిపై పని చేస్తున్నామని, పూర్తి డేటాను సంపాదిస్తున్నామని అన్నారు. దీనిపైనే తమ టీం 24 గంటలు పనిచేస్తుందని సిపి అన్నారు. ఉగ్రవాదం సమాచారం సేకరించేందుకు మా వద్ద వ్యవస్థ ఉందని ఆయన తెలిపారు. దీంతో సిపి సజ్జనార్‌ ట్వీట్‌పై మండిపడ్డ ఓవైసి.. టెర్రరిజానికి మతం లేదన్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఎంత మంది జిహాదీలు ఉన్నారంటూ ప్రశ్నించారు. వాళ్లకు సంబంధించిన సమాచారం మీ వద్ద ఉందా? ఉంటే వాళ్లు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు. అంటూ అసదుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. వీరిద్దరి మధ్య సాగిన ట్వీట్‌ వార్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/