160కోట్ల ఉద్యోగాలకు మంగళం !?
ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కరోకా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 160 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని ఐరాస అంచనా వేసింది.
కరోనా ప్రభావం కారణంగా పని గంటలు తగ్గడం ఇందుకు కారణం కానుందని ఐరాస నేతృత్వంలోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పేర్కొంది.
ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని, వాటిలో అత్యధికంగా రిటైల్, తయారీ రంగాలపై కరోనా ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని వివరించింది.
తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/