తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

union-minister-kishan-reddy

తెలంగాణ లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా బిజెపి – టిఆర్ఎస్ పార్టీల మధ్య వార్ నడుస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ విజయం సాధించి తీరాలని బిజెపి కసరత్తులు చేస్తుంది. ఇప్పటీకే ఇతర పార్టీ నేతలతో పాటు టిఆర్ఎస్ నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానించింది. తాజాగా కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ సైతం బిజెపి లో చేరారు.

ఇదిలా ఉంటె తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నామని.. ఈ విషయంలో తమకు ఎలాంటి తొందరలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎఫ్పుడు జరిగినా విజయం మాత్రం బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం, పార్టీ.. ప్రజాస్వామ్యబద్ధంగానే నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రజల్లో సానుభూతి పొందటం కోసం, హీరోయిజం చూపించుకోవడం కోసం కేసీఆర్ సర్కారు రోజుకో తప్పు చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తన కుటుంబాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కేసీఆర్ దృష్టి పెట్టారని.. పాలనను పూర్తిగా గాలికొదిలేశారన్నారు. బీజేపీని, కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.