వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించిన గూగుల్‌

2021 జూన్ వ‌ర‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ..గూగుల్‌

google
google

అమెరికా: కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు సంస్థలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే గూగుల్ సంస్థ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగించింది. త‌మ ఉద్యోగుల కోసం ఇంటి నుంచి ప‌నిచేసే సౌల‌భ్యాన్ని వ‌చ్చే ఏడాది జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు గూగుల్ సంస్థ వెల్ల‌డించింది. గూగుల్‌కు చెందిన ఆల్ఫాబెట్ సంస్థ‌.. ఆఫీసులో ప‌ని అవ‌స‌రం లేని వారికి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. వాస్త‌వానికి ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాల‌నుకుంటున్న‌ట్లు మొద‌ట్లో గూగుల్ ప్ర‌క‌టించింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర్క్ హోమ్ కాన్సెప్ట్‌ను ఎంక‌రేజ్ చేసింది. ఈ ఏడాది చివ‌ర వ‌ర‌కు తమ ఉద్యోగులు ఇంటి నుంచి ప‌నిచేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ను వ‌చ్చే ఏడాది జూన్ చివ‌ర వ‌ర‌కు పెంచేసింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/