పెరుగుతున్న భద్రాచలం గోదావరి నీటి మట్టం

Godavari river

కొత్తగూడెం: భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఈ రోజు ఉదయం 8 గంటలకు నీటి మట్టం 40.70 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తున్నందున ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రక్రియ పై దృష్టి సారించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/