విశాఖలో సీఎం జగన్ వ్యతిరేక పోస్టర్లు కలకలం

ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా విశాఖ లో పోస్టర్లు వెలిశాయి. ‘గో బ్యాక్ సీఎం సర్’.. ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలు ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశద్వారం వద్ద, పలు కూడళ్లలో వెలిసాయి. వీటిని ‘జన జాగరణ సమితి’ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ శ్రేణులు వాటిని తొలగించేపనిలో పడ్డారు. రాజధాని విశాఖేనని, అక్కడి నుంచే త్వరలో పరిపాలన సాగిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉంటె పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైస్సార్సీపీ కి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవిరావు భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక ఈయన గెలుపు దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రజలు జగన్ ను నమ్ముతున్నట్లు కనిపించడం లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో టి‌డి‌పి ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మూడు జిల్లాలో వైస్సార్సీపీ హవా నడిచింది..కానీ ఇప్పుడు ఆధిక్యం మారిపోతుంది. ఇక ఇప్పుడు విశాఖ లో జగన్ కు వ్యతిరేకంగా పోస్టర్లు మరింత కలకలం రేపుతున్నాయి.