ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం : 40 ఇళ్లు దగ్ధం

గురువారం సాయంత్రం ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈదురుగాలుల‌కు మంట‌లు వ్యాపించి ఓ ఊరును బూడిద చేసాయి. మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో ఈదురుగాలుల వ‌ల్ల అట‌వీప్రాంతంనుంచి మంట‌లు గ్రామానికి వ్యాపించాయి. దీంతో గ్రామంలోని 40 ఇళ్లు కాలిబూడిద‌య్యాయి.

దీంతో గిరిజనులు రోడ్డున పడ్డారు. అగ్ని ప్రమాదం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు ట్రై చేసారు. కానీ గుడిసెలు కావడం మంటలు త్వరగా అంటుకున్నాయి. అలాగే విద్యుత్ సిబ్బంది సైతం ఈ విషయం తెలిసి వెంటనే విద్యుత్ ను నిలిపివేశారు. ప్రస్తుతం గిరిజనులంతా ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.