కూతురుతో క‌లిసి బాలిస్టిక్ క్షిప‌ణిని వీక్షించిన కిమ్‌

Kim Jong Un, Daughter Oversee North Korea “Monster Missile” Launch

సియోల్‌: ఉత్త‌ర కొరియా ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి ని గురువారం ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఆ దేశ నేత కిమ్ జాంగ్ ఉన్‌ .. త‌న కూతురుతో క‌లిసి ఆ ప‌రీక్ష‌ను వీక్షించిన‌ట్లు శుక్ర‌వారం ఫోటోల‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఐసీబీఎంను ఉత్త‌ర కొరియా ప‌రీక్షించ‌డం ఇది రెండోసారి. హాసాంగ్‌-17 మిస్సైల్‌ను ప‌రీక్షించారు. అమెరికా, ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా మిలిట‌రీ డ్రిల్స్ చేస్తున్న నేప‌థ్యంలో ఈ ప‌రీక్ష చేప‌ట్టిన‌ట్లు ఉత్త‌ర కొరియా వెల్ల‌డించింది.

హాసాంగ్‌-17 మిస్సైల్‌ను మాన్‌స్ట‌ర్ మిస్సైల్ గా పిలుస్తున్నారు. గురువారం ఆ క్షిప‌ణి ఆకాశంలోకి ఎగిరింది. అయితే ఆ ప‌రీక్ష‌ను కిమ్ త‌న కూతురుతో క‌లిసి వీక్షించారు. ఆ ఫోటోల‌ను రాండాంగ్ సిన్‌మున్ ప‌త్రిలో ప్ర‌చురించారు. రెండో కూతురు జూ ఏ తో క‌లిసి ఆ ప‌రీక్ష‌ను వీక్షించిన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఐసీబీఎంపై ఉన్న కెమెరాల‌తో తీసిన ఫోటోల‌ను కూడా రిలీజ్ చేశారు. ఉత్త‌ర కొరియా ఇటీవ‌ల యుద్ధ‌కాంక్ష‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. చాలా వేగంగా ఆ దేశం న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ఆయుధాల‌ను స‌మ‌కూరుస్తోంది. వెప‌న్ ప్రొడ‌క్ష‌న్ పెంచాల‌ని కిమ్ ఇటీవ‌ల ఆదేశించారు.