కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం..బాలికపై నలుగురు యువకులు అత్యాచారం

కరీనంగర్‌ జిల్లా చొప్పదండిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఇంటర్ చదువుతున్న సదరు యువతికి చొప్పదండి యువకుడితో ఇన్‌స్టాల్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి తిరిగారు. అయితే ఆ యువకుడు.. ఆమెతో దిగిన ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీన్ని కూడా సెల్‌ఫోన్లో చిత్రీకరించి ఈ విషయాన్ని అతడు స్నేహితులకు చెప్పాడు.

దీంతో మరో ముగ్గురు యువకులు కూడా ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. పదే పదే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో యువతీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. చివరికి వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.