అమితాబ్ ఒక లెజెండ్, ఇండియాకే ఐకాన్ః మమతా బెనర్జీ

భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని వ్యాఖ్య

mamata-banerjee-demands-bharat-ratna-for-amitabh-bachchan

కోల్ కతాః పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త డిమాండ్ చేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఇవ్వాలని అన్నారు. అమితాబ్ ఒక లెజెండ్ అని, ఇండియాకే ఒక ఐకాన్ అని ఆమె కొనియాడారు. భారత సినీ పరిశ్రమకు, ప్రపంచ సినీ పరిశ్రమకు ఆయన ఎంతో చేశారని అన్నారు. భారతరత్నకు అమితాబ్ అన్నివిధాలా అర్హుడని చెప్పారు. కోల్ కతాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/