కొండెకి కూర్చున్న కోడిగుడ్డు ధర

సాధారణంగా సమ్మర్ లో చికెన్ ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. కేవలం చికెన్ ధరలు మాత్రమే కాదు గుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుకుంది. రూ.4 ఉండాల్సిన ధర అమాంతం రూ.7 లకు చేరింది. నెల రోజుల వ్యవధిలో ఫాం వద్ద గుడ్డు ధర సుమారు 90 పైసలు పెరిగినట్టు వ్యాపారులు చెప్తుతున్నారు. గత నెల ఏప్రిల్‌ 13న గుడ్డుధర రూ.4.45 పైసలు ఉండగా.. ప్రస్తుతం రూ.5.35కు చేరింది. రిటైల్‌ మారెట్‌లో చిల్లరగా ఒక గుడ్డును రూ.6.50 నుంచి రూ.7 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.

సాధారణంగానే వేసవిలో లేయర్‌ కోళ్లు వడగాడ్పుల కారణంగా తక్కువ దాణా తీసుకొంటాయి. కొన్ని కోళ్లు ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృత్యువాతపడుతుంటాయి. తద్వారా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈ ప్రభావమే ప్రస్తుతం మారెట్‌ పై పడింది. దీంతో గుడ్ల కొరత ఏర్పడటంతో పాటు ధర పెరిగింది. గుడ్ల ధరలు తగ్గాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందేనని ఫౌల్ట్రీ వ్యాపారులు చెప్తున్నారు. వాతావరణం చల్లబడి లేయర్‌ కోళ్లు చనిపోకుండా ఉంటే గుడ్ల ఉత్పత్తి పెరుగుతుందని అంటున్నారు.