26 నుంచి గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

annual-brahmotsavam-in-tirupati-ranganathaswamy-temple-from-may-26th

తిరుపతిః ఈ నెల 26 నుంచి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మే 25న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.

ఏయే వాహన సేవలు అంటే..

.మే 26న- ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహన సేవ
.మే 27న- ఉదయం చిన్నశేష వాహన సేవ, సాయంత్రం హంస వాహన సేవ
.మే 28న- ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం ముత్యపుపందిరి వాహన సేవ
.మే 29న- ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనం
.మే 30న- ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ
.మే 31న- ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహన సేవ
.జూన్‌ 1న- ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం
.జూన్‌ 2న- ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహన సేవ
.జూన్‌ 3న- ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.