బాలయ్య అమెరికా ను టచ్ చేయబోతున్నాడట..

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ మూవీ పూర్తి చేసాడు. డిసెంబర్ 02 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సింహ , లెజెండ్ చిత్రాల తర్వాత బోయపాటి – బాలకృష్ణ కలయికలో తెరకెక్కిన చిత్రం కావడం తో ఈ మూవీ ఫై అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ అంచనాలను అందుకుంటుందని నమ్మకం నింపింది.

ఇదిలా ఉంటె రీసెంట్ గా క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు గ్రాండ్ గా జరిగాయి. కాగా ఈ మూవీ కి సంబదించిన ఓ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అమెరికా నేపథ్యంగా సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు చెపుతున్నారు. బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. అలాంటిది ఇప్పుడు అలాంటి కథ తో వస్తున్నట్లు చెపుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి మొదలుకానుందట. శ్రుతిహాసన్‌ బాలయ్య కు జోడిగా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్.