నేటి నుంచి జన్ ధన్ ఖాతాల్లో రూ. 500 జమ
మహిళలకు మూడు నెలల పాటు నెలకు రూ. 500 చొప్పున కేంద్రం ఆర్థిక సాయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా లాక్‌డౌన్ సందర్భంగా కేంద్రం మూడు నెలలపాటు జన్ ధన్ యోజన అకౌంట్లు ఉన్న మహిళలకు నెలకు రూ. 500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్‌లో తొలి విడతగా వారి ఖాతాల్లో రూ. 500 జమ చేసింది. తాజాగా రెండో విడతకు సంబంధించిన డబ్బును వారి ఖాతాల్లో జమ చేసింది. ఒక్కో అకౌంట్‌లో రూ. 500 జమచేసింది. అయితే ఈ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం కొన్ని నిబంధనలు విధించింది.
అకౌంట్ నంబర్ చివర్లో 0, 1 ఉన్న ఖాతాదారులు సోమవారం తమ సొమ్మును తీసుకోవాలన్న కేంద్రం… ఖాతా చివర్లో 2,3 అంకెలు ఉన్న వాళ్లు మే 5వ తేదీన తీసుకోవాలని సూచించింది. అకౌంట్ చివర్లో 4,5 ఉన్నవాళ్లు మే 6న డబ్బులు తీసుకోవాలని, ఖాతా చివర్లో 6,7 నెంబర్లు ఉన్నవాళ్లు మే 8న డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి. ఇక ఖాతా చివర్లో 8,9 ఉన్న వాళ్లు మే 11న తమ సొమ్మును తీసుకోవాలి. ఇక మే 11 తరువాత ఎవరైనా ఎక్కడైనా తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/