లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే – మంత్రి గంగుల కమలాకర్

తెలంగాణ లో ప్రస్తుతం పేపర్ల లీకేజ్ వ్యవహారం కొనసాగుతుంది. TSPSC పేపర్లు మాత్రమే కాదు ప్రస్తుతం కొనసాగుతున్న పదో తరగతి పేపర్లు సైతం లీక్ అవుతూ విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలుగు, హిందీ పేపర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. ఈ పేపర్ లీకేజ్ కి కారణం నువ్వంటే..నువ్వు అంటూ బిఆర్ఎస్ , బిజెపి పార్టీల వారు ఆరోపణలు , ప్రతిఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికతకు దారి తీసింది. ప్రస్తుతం ఆయన్ను భువనగిరి కోర్ట్ లో హాజరుపరచబోతున్నారు.

ఇదిలా ఉంటె పేపర్ లీకేజ్ వ్యవహారం ఫై బిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే అని ఆయన ఆరోపించారు. బీజేపీ కుటిల రాజకీయాలకు లీకేజీ నిదర్శనం.. కేవలం బీజేపీ గ్రూపులకే పరీక్ష పేపర్లు వెళ్లాయి.. దీనిని బూచిగా చూపించి ఎన్నికల్లో లబ్ధికి ప్రయత్నిస్తున్నారంటూ గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వేల మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఉసురు సంజయ్‌కు తగులుతుందన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేశారు. లీకేజీ బీజేపీ కుట్రలో భాగమే.. తెలంగాణలో బిహార్‌ తరహా గుండాయిజం.. రౌడీయిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణను బిహార్‌ తరహాగా మారుస్తారేమోనని భయం వేస్తోంది.. అన్నింటికీ కరీంనగరే వేదిక అవుతోంది.. అంటూ గంగుల మండిపడ్డారు. యువతను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ లీకేజీలకు పాల్పడుతోంది.. నిరుద్యోగులకు ఉపాధి రాకుండా బీజేపీ జెండా పట్టుకు తిరగాలనే కుట్ర చేస్తుందన్నారు.