బిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీ కి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధిష్టానానికి పంపించారు. గత కొద్దీ రోజులుగా మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన కొడుకుకు మెదక్ టికెట్ కోసం ట్రై చేస్తున్నప్పటికీ..సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం మైనంపల్లి ఆగ్రహంతో ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన మంత్రి హరీష్‌రావుపై తీవ్ర విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

ఆ టైం లోనే పార్టీ మైనంపల్లి ఫై యాక్షన్ తీసుకుంటుందని అంత భావించారు. కానీ పార్టీ నుండి ఎలాంటి స్పందన రాలేదు. అయినప్పటికీ మైనంపల్లి పార్టీ ఫై అసంతృప్తి తోనే ఉన్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఆహ్వానం రావడం తో..బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. కేవలం తన కొడుక్కు టికెట్ ఇవ్వలేదనే కోపం తోనే పార్టీకి రాజీనామా చేసినట్లు అర్ధమవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 26 న ఢిల్లీ లో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు వినికిడి.