40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు తుక్కైపోయాడు: ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
రాష్ట్రంలో యువ సిఎం వైఎస్ జగన్ ట్రెండ్ సెట్

దేశంలోని కీలక నేతల కుమారులు రాజకీయాల్లో బాగా రాణిస్తుంటే.. లోకేష్ మాత్రం తుక్కైపోయాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. “వైస్సార్ కుమారుడు రికార్డ్స్ సృష్టించారు. స్టాలిన్ కుమారుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడు. కేసీయార్ కుమారుడు గెలిచాడు. ములాయం కుమారుడు గెలిచాడు. థాక్రే కుమారుడు గెలిచాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ కొడుకు మాత్రం తుక్కైపోయాడు – స్టాన్ ఫోర్డ్ ప్రోడక్ట్ అని బిల్డప్ ఇస్తాడు’అంటూ విమర్శించారు. తల్లిదండ్రులిద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినప్పుడు పిల్లలకు వ్యాధి సోకకుండా సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 32 బాలల సంరక్షణ సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సంక్షోభ సమయంలో దేశంలోనే ఇటువంటి మానవత కనబర్చిన రాష్ట్రం మనది. యువ సిఎం ట్రెండ్ సెట్ చేశారని విజయసాయి రెడ్డి అన్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/