మాస్క్‌లను కల్తీ చేస్తున్న ముఠాలు

పక్కా సమాచారంతో రైడ్‌ చేసిన పోలీసులు

n95 mask
n95 mask

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కరోనా నుంచి తప్పించుకునేందకు ఎన్‌-95 మాస్కులు ధరిస్తే సరిపోతుందని భావిస్తున్న ప్రజలు అధికంగా మాస్కులు కొనేందకు మొగ్గు చూపుతున్నారు. దీంతో అక్కడ ఎన్‌-95 మాస్కులకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవకాశాన్ని అంది పుచ్చుకోవాలని మాస్క్‌లను కల్తీ చేసే బ్యాచ్‌లు తయారవుతున్నాయి.పాల్ఘర్‌ ప్రాంతంలో ప్రజలు వాడిపడేసిన మాస్కులను సేకరించి, వాటిని ఉతికి ,ఇస్త్రీ చేసి తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ సమాచారం అందుకున్న పొలీసులు రైడ్‌ చేయగా 25 వేలకు పైగా మాస్కులు దొరకడంతో అవాక్కయ్యారు. వీటి విలువ సుమారు 50లక్షలు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వారిపై నిత్యవసరాలచట్టం, ఎపిడెమిక్స్‌ చట్టం, కోవిడ్‌ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/