ఝార్ఖండ్లో మరో ఘోరం..డాన్సర్ ఫై గ్యాంగ్ రేప్

స్పానిష్ టూరిస్ట్ పై అత్యాచార ఘటన మరువక ముందే ఝార్ఖండ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పాలము జిల్లాలో ఛత్తీస్గఢ్ డాన్సర్ ఫై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విదేశాల నుంచి భారతదేశం చూడ్డానికి వచ్చే మహిళల మీద ఆకృత్యాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. రీసెంట్‌గా స్పెయిన్ నుంచి ఓ మహిళను జార్ఖండ్‌లో (Jharkhand) గ్యాంగ్ రేప్ చేశారు. మొత్తం పది మంది స్పానిష్ మహిళ దారుణంగా రేప్ చేశారు. ఆమె భర్త నుంచి దూరంగా లాక్కుని వెళ్ళి.. అతనికి కనిపిస్తుండగానే ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌-సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఘటన కు సంబంధించి వార్తలు వైరల్ అవుతుండగానే మరో దారుణం చోటుచేసుకుంది. పాలము జిల్లాలో ఛత్తీస్గఢ్ డాన్సర్ ఫై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ‘ప్రధాన నిందితుడు గోలు కుమార్ బాధితురాలిని ఓ ప్రోగ్రాంకు ఆహ్వానించగా అది క్యాన్సిల్ అయింది. ఇదివరకే పరిచయం ఉండటంతో ఆమె నిందితుడి రూమ్ కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి నిందితులు ఈ అత్యాచారం చేశారు’ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.