ప్రతీ పౌరుడికి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంః డిప్యూటీ సీఎం భట్టి

Deputy CM Bhatti

హైదరాబాద్‌ః ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు. సంపద అంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా మాట ఇస్తున్నాం. ప్రజల కలలను నిజం చేస్తున్నామన్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలను హైదరాబాద్ గా పిలుచుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ గర్వకారణమనే చెప్పవచ్చు.

జూబ్లీహిల్స్ బూత్ లెవల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు భట్టి విక్రమార్క. పొరపాటున ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని ప్రయత్నం చేస్తే.. పోలీస్ యంత్రాంగం ఉంటుంది. ప్రతీ పౌరుడికి రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. హైదరాబాద్ లోని ప్రతీ కుటుంబం ప్రశాంతంగా జీవించాలి. హైదరాబాద్ నగరం ప్రపంచంలో అందమైన నగరంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ఐఐటీ, ఐఐఐటీ, హైదరాబాద్ కి మంచి నీళ్లు, కరెంట్ వంటివి అన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో ఒక్క సంస్థను కూడా నిర్మించలేదన్నారు. మనం ఆస్తులు సృష్టిస్తే.. బిఆర్ఎస్ ప్రభుత్వం అమ్మకాలకు పెట్టిందని తెలిపారు.