సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం

సిరిసిల్ల ‘సెస్’ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి రైతన్నలు, వినియోగదారులు పట్టం కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారని విజయం సాధించిన వారు చెపుతున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత జరిగిన తొల్లి ఎన్నికల్లో సెస్‌పై గులాబీ జెండా ఎగుర వేసి సత్తా చాటింది. ఈ విజయంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం ఆకాశానికి తాకుతుంది.

కొత్తగా ఎన్నికైన 15 మంది డైరెక్టర్ల జాబితా ఇలా ఉంది. సిరిసిల్ల టౌన్ -1 డైరెక్టర్ గా దిడ్డి రమాదేవి (BRS), సిరిసిల్ల టౌన్ -2 డైరెక్టర్ గా లక్ష్మీనారాయణ (BRS) ఎన్నికయ్యారు. తంగళ్ళపల్లి డైరెక్టర్ గా చిక్కాల రామారావు ( BRS), ముస్తాబాద్ డైరెక్టర్ గా సందుపట్ల అంజిరెడ్డి ( BRS), ఎల్లారెడ్డిపేట డైరెక్టర్ గా వరుస కృష్ణ హరి(BRS), గంభీరావుపేట డైరెక్టర్ గా గౌరనేని నారాయణరావు (BRS), వీర్నపల్లి డైరెక్టర్ గా మాడుగుల మల్లేశం (BRS), వేములవాడ అర్బన్ డైరెక్టర్ గా రేగులపాటి హరి చరణ్ రావు, వేములవాడ టౌన్ డైరెక్టర్ గా నామాల ఉమా, కోనరావుపేట డైరెక్టర్ గా దేవరకొండ తిరపతి (BRS), రుద్రంగి డైరెక్టర్ గా ఆకుల గంగారం (BRS), ఇల్లంతకుంట డైరెక్టర్ గా మల్లుగారి రవీందర్ రెడ్డి(BRS), బోయిన్పల్లి డైరెక్టర్ గా కొట్టేపల్లి సుధాకర్ (BRS) ఎన్నికయ్యారు.

మొత్తం 15స్థానాలకుగాను 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెస్‌ పరిధిలో మొత్తం 87,130 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ 75 నుంచి 80 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. కానీ, ఈ సారి మాత్రం 73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెస్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 84 శా తం నమోదైందని అధికారులు తెలిపారు.