చంద్రబాబు తో భేటీ కాబోతున్న వైసీపీ మంత్రి జయరాం

gummanur jayaram
gummanur jayaram

ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాం..ఈరోజు సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబు తో భేటీ కాబోతున్నారు. గత కొద్దీ రోజులుగా జయరాం వైసీపీ ని వీడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్తలకు ఈరోజు తో ఫుల్ స్టాప్ పడబోతున్నట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన.. ఈరోజు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం.

అంతకంటే ముందు మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జయరాం సోదరుల కార్లకు టీడీపీ స్టిక్కర్లు అతికించారు. కాగా కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ ఆయనకు సూచించగా.. ఆలూరును వీడనని తేల్చి చెప్పారు. అయినప్పటికీ వైసీపీ జయరాం కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడం తో ..టిడిపి లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.