గాంఢీవధారి అర్జున రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో వరుణ్ తేజ్. గని , ఎఫ్ 3 లతో ప్లాప్స్ అందుకున్న ఈ హీరో ..ఇప్పుడు గాంఢీవధారి అర్జున మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రవీణ్ స‌త్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, మేకింగ్‌ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేసాయి.

ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. వరుణ్‌ తేజ్‌ గన్‌ పట్టుకుని అల్ట్రా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. మిక్కీ జే మెయర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించింది.