నేడే తెలంగాణ లో ఫ్రీ కరెంట్, సబ్సిడీ సిలిండర్ పథకాలు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర సర్కార్ మరో రెండు కీలక పథకాలను నేడు ప్రారభించబోతుంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి హామీలను అమలు చేసిన రేవంత్ సర్కార్..కాసేపట్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేయనున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ (గృహలక్ష్మి), రూ.500కే గ్యాస్ సిలిండర్ (మహాలక్ష్మి) పథకాలను సచివాలయంలో ప్రారంభించనున్నారు. సాయంత్రం చేవెళ్లలో బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. అక్కడే పథకాలను ప్రారంభించాల్సి ఉండగా, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడం, ప్రియాంక గాంధీ సైతం సభకు హాజరుకాకపోవడం తో పధకాల ప్రారంభ కార్య క్రమంలో మార్పులు చేశారు.

ఇక సిలిండర్ పథకానికి ఏడాదికి రూ.855 కోట్లు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఇప్పటివరకు 39.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరు గతంలో వాడిన సిలిండర్ల సగటు లెక్కను పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం ఏడాదికి 2 కోట్ల సబ్సిడీ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో అర్హులు పెరిగితే ప్రభుత్వంపై మరింత భారం పడనుంది.