తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్న ఫాక్స్ కాన్ః మంత్రి కెటిఆర్

లక్ష మందికి ఉపాధి కలుగుతుందన్న కెటిఆర్

foxconn-set-to-roll-out-huge-investments-in-telangana

హైదరాబాద్ః ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ దిగ్గజం హాన్ హాయ్ ఫాక్స్ కాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఫాక్స్ కాన్ పెట్టుబడుల ద్వారా తెలంగాణలోని లక్ష మంది యువతకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ నేడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ తో సమావేశమై పెట్టుబడులపై ప్రకటన చేశారని కెటిఆర్ వెల్లడించారు. ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.

కెటిఆర్ ఇటీవల ఢిల్లీలో ఫాక్స్ కాన్ చైర్మన్ తో భేటీ అయ్యారు. తెలంగాణకు రావాలంటూ ఆహ్వానించారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను, రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని కెటిఆర్ ఆయనకు వివరించారు. కెటిఆర్ ఆహ్వానంపై యంగ్ ల్యూ ఇవాళ తన బృందంతో హైదరాబాద్ విచ్చేశారు. ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందంతో సమావేశంలో సీఎం కెసిఆర్ తో పాటు కెటిఆర్ కూడా పాల్గొన్నారు.