అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ… డీజీపీతో జగన్ కీలక భేటీ

జగన్-డీజీపీ సమీక్షలో సజ్జల

ys-jagan-meeting-with-dgp-a-head-of-avinash-reddy-cbi-questioning

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై ఉత్కంఠ ఓ వైపు … బెయిల్ పిటిషన్ పైన తెలంగాణ హైకోర్టులో వాదనలు మరోవైపు.. ఇలాంటి సమయంలో సిఎం జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల పైన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా పాల్గొన్నారు. వివేకా హత్య కేసు పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లుగా సమాచారం.

అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పైన హైకోర్టులో వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. అతనిని సీబీఐ నేటి సాయంత్రం విచారణకు పిలిచింది. ఇదే సమయంలో కోర్టులో బెయిల్ కు సంబంధించి వాడిగావేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు ఉదయం గం.10.30కు విచారణకు పిలుస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఆయనను సీబీఐ రేపు విచారించనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ పైన గంటలుగా వాదనలు కొనసాగుతున్నందున ఉత్కంఠ కొనసాగుతోంది.