కేంద్రం తెలంగాణ‌కు చేసిందేమీ లేదు.. మంత్రి కేటీఆర్

హైదరాబాద్: న‌గ‌గ‌రంలోని ప‌ల్ల‌వి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవీకి మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేసిన‌ ప్ర‌యివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేష‌న్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈసందర్బంగా అయన మాట్లడుతూ..కొత్త‌గా ఏర్ప‌డ్డ‌ తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు అని స్ప‌ష్టం చేశారు. విభ‌జ‌న‌ చ‌ట్టంలోని సంస్థ‌ల‌ను కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌లేదు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 ల‌క్ష‌ల 72 వేల కోట్లు క‌డితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. ల‌క్షా 40 వేల కోట్లు మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత హైద‌రాబాద్ ఎంతో అభివృద్ధి చెందింద‌న్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్ప‌డిన మూడు రాష్ర్టాలు ఇంకా సెటిల్ కాలేదు. తెలంగాణ ఏర్ప‌డిన 6 నెల‌ల్లోనే అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాం. మౌలిక అంశాల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం. తాగు, సాగునీటి క‌ష్టాల‌కు ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/