వడోదరలో భారీ పేలుడు..నలుగురు మృతి

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని వడోదరలో భారీ పేలుడు సంభవించింది. పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రసాయనిక కార్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాయిలర్‌ పేలిన ఈ ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి కూడా ఉంది. ఆమె 30 ఏళ్ల తల్లి తీవ్ర గాయాలపాలైంది. క్షతగాత్రులను హుటాహుటినా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

పోలీస్‌ అధికారి సాజిద్‌ బలోచ్‌ మాట్లాడుతూ.. బాయిలర్‌ పేలడంతో చుట్టుపక్క ప్రాంతాల్లోని ఇళ్ల గోడలు కూలిపోయాయి. 1.5 కి.మీ వరకు శబ్దాలు వినిపించాయి. యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ పదార్థాలు తయారు చేస్తారు. కాంటన్‌ లేబోరేటరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌లో 8 రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్‌ 16న పంచమహల్‌ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఏడుగురు చనిపోయారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/