సమంతకు విడాకుల భరణం కింద కోట్ల రూపాయలు అక్కినేని ఫ్యామిలీ ఇస్తుందా..?

సమంతకు విడాకుల భరణం కింద కోట్ల రూపాయలు అక్కినేని ఫ్యామిలీ ఇస్తుందా..?

ఇండస్ట్రీ లోనే కాదు బయట సినీ జనాలంతా మాట్లాడుకుంటుంది ఒకే అంశం..అదే నాగ చైతన్య – సమంత విడాకులు. ప్రేమించి , పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారనే వార్తలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. విడాకులకు సంబదించిన రోజుకో కథనం బయటకు వస్తున్నప్పటికీ..ఇప్పటివరకు ఈ వార్తల ఫై అక్కినేని ఫ్యామిలీ స్పందించలేదు. అయితే సమంత మాత్రం అప్పుడప్పుడు ఇన్ డైరెక్ట్ గా తన విడాకుల విషయాన్నీ చెప్పకనే చెపుతూ వస్తుంది.

సమంత-నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం పెళ్లి తర్వాత కూడా ‘సమంత’ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో బోల్డ్ గా నటించడమే అని అంటున్నారు. పద్ధతిగల అక్కినేని కుటుంబంలో కోడలు అయ్యిండి అలా నటించడంపై వారంతా అభ్యంతరం తెలిపారని.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం కావాలని అక్కినేని ఫ్యామిలీ పెట్టిన ఆంక్షలను సమంత పట్టించుకోకపోవడంతో విడాకులకు దారితీసిందని టాక్ నడుస్తోంది. అమలలా పెళ్లి తర్వాత సినీ కెరీర్ వదిలేసి ఫ్యామిలీకి అంకితం కావడానికి సమంత ఒప్పుకోలేదట.. పైగా ఇటీవల ‘ఫ్యామిలీ మ్యాన్2’ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించడం.. రేప్ సీన్లలో కనిపించడంతో నాగచైతన్యతో దూరం మరింత పెరిగిందని.. అదే వారిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారని చెపుతున్నారు.

వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఫ్యామిలీ కోర్టులో పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారని.. ఆ తర్వాత కూడా ఇద్దరూ విడిపోవడానికే మొగ్గుచూపారని టాక్. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లో వీరి విడాకులు పూర్తి అవుతుందని ఓ ఆంగ్ల పత్రిక సంచలన కథనం ప్రచురించింది. అంతేకాదు.. సమంతకు విడాకుల భరణం కింద కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అక్కినేని ఫ్యామిలీ ఓకే చెప్పిందని అందులో రాసుకొచ్చారు. ఈ వార్తలతో అభిమానులు మరింత బాధపడుతున్నారు.