బాలయ్య తో సందడి చేసిన జక్కన్న

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆహా లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ, నాని, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ చిత్రబృందం వచ్చి అనేక విశేషాలు పంచుకొని ఆకట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేస్తామని తెలిపింది.
ప్రస్తుతం రాజమౌళి ..ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఈ తరుణంలో చిత్ర నటి నటులు , రాజమౌళి ఇలా అంత సినిమా ప్రమోషన్ లలో బిజీ గా ఉన్నారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా తారక్ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు.