ఈ నెల 28న మేడారంలో తిరుగు వారం పండుగ..

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ముగిసింది. తిరిగి 2026లో ఈ మహాజాతర జరగనుంది. జాతరకు 1.45 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం ఈ నెల 28న సమ్మక్క-సారలమ్మకు తిరుగు వారం పండుగ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మేడారం గ్రామస్థులు, ఆదివాసీలు, పూజారుల కుటుంబీకులు ఇళ్లను శుద్ధి చేసి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.

ఇక మేడారం జాతరలో ధరలు ఆకాశాన్ని తాకాయి. వాటర్ క్యాన్ నుంచి కూల్ డ్రింక్ ధరలు భారీగా పెంచేసి అమ్మడంతో భక్తులు లోబోదిబోమన్నారు. సరఫరా కష్టంగా ఉండటంతో ధరలు పెంచేసి అమ్ముతున్నామని వ్యాపారులు చెప్పుకొచ్చారు. 20 లీటర్ల వాటర్ క్యాన్ ధర రూ. 150 పలుకగా.. ఒక్కో బీరు రూ.280-300కు విక్రయించారు. అవసరాన్ని ఆసరాగా చేసుకుని మొబైల్ ఛార్జింగ్ గంటకు రూ.50-70 వసూలు చేసారని భక్తులు ఆవేదన వ్యక్తం చేసారు.