రెండు నెలల జీతాలు చెల్లించలేము

స్పైస్ జెట్ విమానయాన సంస్థ ప్రకటన

spicejet
spicejet

న్యూ ఢిల్లీ ; తమ పైలెట్లకు మార్చి, ఏప్రిల్, నెలలకు సంబంధించి జీతాలు చెల్లించలేమని స్పైస్ జెట్ విమానయాన సంస్థ తెలిపింది. కేవలం అనుమతితో నడుస్తున్న కార్గో విమానాల పైలెట్లకు మాత్రమే జీతాలు చెల్లిస్తామని, అది కూడా విమానాలు నడిపిన గంటలకు లెక్కకట్టి చెల్లింపులు చేస్తామని తెలిపింది. లాక్ డౌన్ తరువాత ఆంక్షలు సడలించిన వెంటనే తమ సర్వీసుల సంఖ్యను పెంచేందుకు స్పైస్ జెట్ సిద్దమవుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/telangana/