స్పందన కార్యక్రమంపై సిఎం జగన్‌ సమీక్ష

ఆగస్టు 15 నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఏపి సిఎం జగన్‌ స్పందన కార్యక్రమంపై మంగళవారం వీడియో కాన్పరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాలు, ఇసుక, ఉపాధి హామీ పనులు, కోవిడ్19 నియంత్రణ చర్యలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించారు. ఏపిలో 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం. పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదన్నారు.

పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని సిఎం అన్నారు. టిడిపి నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని.. కరోనా వైరస్ కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అదే విధంగా డీ పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇవ్వొచ్చని, అయితే డీ పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్‌ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని సిఎం జగన్‌ పేర్కొన్నారు. మంచి ఆలోచనతో పని చేస్తున్నామని.. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/