సిఎం పై మాజీ ఎంపి వివేక్ ఘాటు వ్యాఖ్యలు
ఏపి సిఎం జగన్‌తో స్నేహం ఓ ఎత్తుగడ: మాజీ ఎంపి వివేక్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై మాజీ ఎంపి, బిజెపి నేత వివేక్ సంచలన విమర్శలు చేశారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడమే కెసిఆర్ రాజకీయమని తీవ్ర స్థాయిలో ఘాటు విమర్శలు చేశారు. కెసిఆర్ ది యూజ్ అండ్ త్రో మనస్తత్వమని, ఏపి ముఖ్యమంత్రి జగన్ తో స్నేహం కూడా ఆయన అవకాశవాద ఎత్తుగడల్లో భాగమేనని వివేక్ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక పలుమార్లు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయిన విషయం, రెండు రాష్ట్రాల అభ్యున్నతి కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్నేహం అంతా ఒట్టిదేనని వివేక్ తోసిపుచ్చారు. కేవలం కమిషన్ల కోసం జగతో కెసిఆర్ స్నేహం నటిస్తున్నారని, ఆ అవసరం తీరాక పక్కన పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యని అన్నారు. ఎవరినైనా వాడుకుని వదిలేయడం కెసిఆర్ రాజకీయమని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని మసలు కుంటే జగన్ కే మంచిదని హితవు పలికారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/