బిజెపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం

former-chevella-mla-ks-ratnam-joined-bjp

హైదరాబాద్‌ః చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం నేడు బిజెపిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బిజెపికి ప్రజా సంక్షేమమే ముఖ్యమని అన్నారు. పదవులు కాదని.. ఇతర పార్టీలకు పదవులు ముఖ్యమని పునరుద్ఘాటించారు.

బిజెపి తెలంగాణ ప్రజల టీమ్ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు అందరూ కలిసి పనిచేయాలని కమలం శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ డబ్బులు పంచుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనను ప్రజలు చూశారని.. ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బిఆర్ఎస్ పాలననూ చూశారని.. అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బిజెపికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.