పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల జీవిత బీమా

రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను నమోదు చేస్తామని సోనియాకు మాట ఇచ్చాం

హైదరాబాద్: రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత బీమా వర్తిస్తుందని తెలిపారు. దేశ బానిస సంకెళ్లను తెంచింది కాంగ్రెస్ పార్టీనే అని… దేశం కోసం ఎన్నో త్యాగాలను చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. రాహుల్ గాంధీ లాంటి గొప్ప నాయకుడి పార్టీలో సభ్యుడినని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుందని అన్నారు.

పార్టీ కార్యకర్తలకు ఈ నెల 9 నుంచి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని రేవంత్ చెప్పారు. 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జన జాగరణ యాత్ర ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9న భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు అనుమతిస్తే హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తామని, ఇవ్వకపోతే నగర శివారులో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రాహుల్ గాంధీ వస్తారని చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/