దృఢమైన కండరాలకు..

Exercises Necessary-
Exercises

మెనోపాజ్‌ దశలో మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఆస్టియోపొరోసిస ఒకటి. దాన్ని అధిగమించాలంటే మొదటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం జీవితంలో భాగం కావాలి. దాంతోపాటు వారంలో కనీసం రెండుమూడు సార్లయినా బరువులు ఎత్తడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల కండరాలు దృఢంగా మారడవే కాదు, ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఆస్టియోపొరోసిస్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం కావాలి. ఈ పోషకం శరీరానికి సరిపడా అందాలి. ముఖ్యంగా కాల్షియం లభించే పదార్ధాలే కాదు, వైద్యుల సలహాతో ఆ మాత్రల్ని వయసును బట్టి వాడాల్సి ఉంటుంది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలకు రోజూ 1300 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. వయసు పెరిగేకొద్దీ 1200 మిల్లీగ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు రోజు గ్లాసు పాలు తాగడమూ
అవసరమే అంటారు వైద్యులు. కొన్నిసార్లు ఇతర అనారోగ్యాలకు మీరు వాడే మందులతోనూ ఎముకలు గుల్లబారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉత్ప్రేరకాల విషయంలో ఈ సమస్య ఎదురవుతుంది. ఏదైనా అనా రోగ్యానికి వైద్యులు అలాంటి మాత్రల్ని సూచిస్తే మీ సందేహాలను నివృత్తి చేసు కోవడం మంచిది. వయసు పెరిగేకొద్దీ ఎముక సాంద్రత తెలుసుకునేందుకు కనీసం యేడాది కోసారి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/