మీకు పెట్స్‌ ఇష్టమేనా?

పెంపుడు జంతువులతో స్నేహం

Friendship with pets
Friendship with pets

పెంపుడు జంతువులు కుక్క, పిల్లి, కుందేలు ఇలా దేన్ని పెంచుకున్నా వాటి కారణంగా పెంచుకునే వాళ్లలో నిస్వార్థంగా ప్రేమను పంచే లక్షణం పెరుగుతుంది.

అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెంపుడు జంతువులు ఉన్న వాళ్లతో ప్రేమలో పడినా, పెళ్లి చేసుకున్నా వాళ్ల జీవితం ఆనందసాగరమే.

వీళ్లు జీవిత భాగస్వామి పట్ల ఎంతో శ్రద్ధని, నమ్మకాన్ని కనబరుస్తారు. వాళ్లలో సాధించే గుణం తక్కువ. అందుకే కొత్తగా పెళ్లయిన దంపతులు సైతం ఓ కుక్కపిల్లనో పిల్లిపిల్లనో పెంచుకోవడం వల్ల వాళ్ల మధ్య ఒత్తిడి కారణంగా చోటుచేసుకునే వాగ్వాదాలు ఉండవు.

పెట్‌ని చూడగానే అన్నీ మరిచిహాయిగా ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పెంపుడు జంతువుల వల్ల వాళ్లలో ఆక్సీటోసిన్‌శాతం పెరగడంతో ప్రేమబంధం మరింత పటిష్టం అవుతుందట.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/