పిల్లలకు అనారోగ్య సమస్యలు
రాత్రిళ్లు పక్కలో మూత్ర విసర్జన చేయడం, మూత్రం మంటగా ఉండి, యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం, తెల్లమైల, జననేంద్రియాల వాపు చిన్న చిన్న పొక్కులు కడుపునొప్పి, బరువు తగ్గడం, ఎంత తిన్నా వయస్సు తగ్గ బరువు ఉండకపోవడం, ముఖంపై తెల్లని మచ్చలు, చర్మ సమస్యలుత్పన్నమవుతాయి. కాని చర్మం డామేజ్ కాకపోవడం విశేషం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలేర్పడి చికాకు పెడతాయి తప్ప ఎటువంటి దీర్ఘకాలిక తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగించవు. దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆటో ఇన్ఫెక్షన్ వల్ల మందులు వాడినపుడు తగ్గి మళ్లీ మళ్లీ వచ్చే అవకాశముంది. క్రానిక్ కేసుల్లో పెరిటోనియల్కేవటీ ఇన్ఫెక్షన్, నిద్రలేమి, రక్తహీనత, చర్మం సమస్యలు, విటమిన్ బి లోపం, అపెండిసైటిస్, బాక్టీరియల్ డెర్మటైటిస్ ఫొలిక్యులైటిస్, తరచు కడుపునొప్పి రావడం వంటి అనేక సమస్యలేర్పడుతాయి. జాగ్రత్తలు చికిత్స: రక్తం, మల పరీక్షలు, టేప్ పరీక్షల ద్వారా వ్యాధినికి నిర్ధారించిన తర్వాత డీవార్మింగ్ మాత్రల్ని (మెబండజోల్) ప్రతి 6 నెలలకోసారి వాడాల్సి ఉంటుంది. తరచుగా కనుక డీవార్మింగ్ మాత్రలు వాడడం వల్ల కొందరిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ (తలనొప్పి, డిజ్జీనెస్, రాష్ వంటివి) కనిపించవచ్చు. ఇవి కొన్ని నిమిషాలు ఉండి దానంతట అవే తగ్గిపోతాయి. చేతుల పరిశుభ్రత చాలా ముఖ్యం. భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. శారీరక పరిశుభ్రత చాలా అవసరం. ఇల్లు, పరిసరాలు, బాత్రూమ్స్ శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ పిల్లలకి రెండు పూటలా స్నానం చేయించడం, శుభ్రంగా ఉంచడం మంచిది. పిల్లలు ఆటవస్తువుల్ని నోట్లో పెట్టుకోకుండా, మురికిచేతులతో తినకుండా చిన్నప్పటి నుండే వారికి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. గోళ్లు పెరగకుండా కత్తిరించడం, గోళ్లు కొరడం, గీరడం నోట్లో వేళ్లు పెట్టుకోవడం వంటి దురలవాట్లు ఉంటే మాన్పించాలి. ఆహారంలో వెల్లుల్లి వాడడం, క్యారట్, పాలు వంటి పోషకాహారం ఇవ్వాలి. బయట దొరికే జంక్‌ఫుడ్ తినకుండా ఉండడమే మంచిది. మలద్వారా దగ్గర దురద ఉంటే వాజిలైన్ లేదా కొబ్బరినూనె అప్లై చేయడం మంచిది. తడి లేకుండా పొడిగా ఉంచాలి. తరుచు పిల్లల డయిపర్స్ మారుస్తుండాలి. నులి పురుగుల సమస్య చిన్నదైపప్పటికి వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్ల వల్ల సులభంగా దూరం చేయవచ్చు. దుప్పట్లు, టవల్స్, లో దుస్తులు, బట్టలు ఎప్పటికప్పుడు ఉతికి ఎండలో ఆరవేయడం మంచిది. దీనివల్ల ఎటువంటి సమస్యలుత్పన్నం కావు.
-డాక్టర్. కె.ఉమాదేవి,
తిరుపతి
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/