పిల్లల్లో అతిసార వ్యాధిచిన్నారుల ఆరోగ్యం-సంరక్షణ

చిన్నపిల్లలో సంభవించే వ్యాధులన్నింటిలోను, అతిసారవ్యాధి చాలా తీవ్రమైనది. ఈ వ్యాధివలన, ఏటా లక్షలమంది పిల్లలు మనదేశంలో మరణి స్తున్నారు. ఈ వ్యాధికి ముఖ్యకారణాలు అపరి శుభ్రత, అంటువ్యాధులు. ప్రజలకు ఆరోగ్య విషయాలపట్ల కనీసపు శ్రద్ధ, అవగాహన లోపించడం మరో ముఖ్యమైన కారణం. కొన్ని తీవ్రస్థాయిలో వచ్చి ప్రాణాపాయానికి దారి తీయవచ్చును. విరేచనాలు ఎక్కువగా అవడం వలన, పిల్లల శరీరంలోని నీరు, లవణాలు బయటకుపోయి నీరసం వస్తుంది. ఈ పరిస్థితిని డిహైడ్రేషన్‌ అని అంటారు.

ఈ పరిస్థితిని అదుపు చేయడానికి, నోటి ద్వారా లవణమిశ్రమాన్ని ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాలలో, విరేచ నాలు అవ్ఞతున్న పిల్లలకు ఆహారం, నీరు, పాలు కూడా ఇవ్వరు. కొంతమంది పూర్తి ఉపవాసం పాటిస్తారు. ఇందువలన జలలేమి మరింత జఠిలమయి, ప్రాణాపాయానికి దారి తీస్తుంది. ఎందు వలనంటే ఒక పక్క విరేచనాలలో నీరు, లవణాలు పోతుం టాయి. నోటి ద్వారా మామూలుగా ఇవ్వాల్సిన ద్రవాలు కూడా ఇవ్వకపోవడం వలన తీవ్రమైన డిహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా ప్రపంచంలో, దాదాపు 25 మిలియన్ల పిల్లలు విరేచనాల వలన మరణిస్తున్నారు. అంటే ప్రపంచంలో ప్రతి ఆరు సెకండ్లకు ఒక శిశువు విరేచనాల వలసన మృతి చెందుతోంది.

ఈ మరణాలలో చాలావాటిని సరైన ఆరోగ్యశిక్షణ ద్వారా నివారించవచ్చును. మామూలుగా చిన్నపిల్లలకు ఏడాదికి 4,5 సార్లు విరేచనాలు వస్తాయి. ఇవి రెండుమూడు రోజులుండి, మందులు వాడినా, వాడకపోయినా తగ్గిపోతాయి. వీటివలన ఎదుగుతున్న పిల్లలకు కొంత ప్రయో జనం ఉంది. శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగుతున్న పిల్లలలో, విరేచనాలు తక్కువగా వస్తాయి. కొంతమంది పిల్లలకు డబ్బాపాలు తీసుకొంటున్న పిల్లలలో, విరేచనాలు తక్కువగా వస్తాయి. గేదెపాలు, డబ్బా పాలు తీసుకొంటున్న పిల్లలలో ఈ వ్యాధులు ఎక్కువగా వస్తాయి.

కొంతమంది పిల్లలకు 2,3 వారాల పాటు విరేచనాలు అవడం, లేకపోతే తరచు విరేచనాలు అవడం జరుగుతుంది. ఇటు వంటి పిల్లలకు సరైన వైద్యుని సంప్రదించి చికిత్స చేయించాలి. ఎక్కువ రోజులు విరేచనాలు అయిన పిల్లలలో పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది.
విరేచనాలకు కారణాలు: రొటా వైరస్‌, కొలి అనే సూక్ష్మజీవ్ఞలు, కలరా (చీము విరేచనాలు), కడుపులో ఏలికపాములు, ఎంజైమ్‌ లోపాలు బాలల శరీరంలో దాదాపు 60శాతం

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/