ముఖానికి వ్యాయామం

అందమే ఆనందం

30 వడిలోకి అడుగు పెట్టామో లేదో.. ముడతలు, వృద్ధాప్య ఛాయలంటూ ఖంగారు పడే అమ్మాయిలందరో … అందుకే క్రీములకు తెగ ఖర్చు పెట్టేస్తుంటారు.. పూర్తిగా వాటిపైనే ఆధారపడక ఈ పేస్ ఎక్సర్ సైజులనూ ప్రయత్నించ మంటున్నారు నిపుణులు..

face exercise
face exercise

మెడ దగ్గర చర్మం ముడతలు పడినట్టు అనిపిస్తోందా?.. నెమ్మదిగా అది డబుల్ చిక్ కీ దారి తీయొచ్చు . అలాంటపుడు, నిటారుగా నిలుచొని తలను వీలైనంత వెనక్కి వంచండి.. నాలుకను పై పెదవికి ఆనించి.. కొద్దీ సేపు అలాగే వంచండి.. మెడ నొప్పి అనిపించగానే యధా స్థితికి వచ్చేయాలి.. ఇలా రోజూ అయిదు సార్లు చేస్తే సరి..

నుదిటి మీద గీతలను తగ్గించు కోవాలా?. అయితే ఆశ్చర్యపోకండి… ఏం లేదూ… కళ్ళను వీలైనంత పెద్దగా చేసి, వీలైనంత సేపు ఉంచండి.. ఇలా రోజుకు 8-10 సార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది..

ఉబ్బిన కళ్ళు , కంటి చివరన గీతలు .. వృద్దాప్య ఛాయలకు సంకేతాలే.. వీటిని తగ్గించాలంటే.. మధ్య వేళ్లను కనుబొమ్మల వద్ద ఉంచి , రెండు చూపుడు వేళ్ళతో కాను కోణాలవద్ద ఒత్తిడిగా ఉంచాలి.. తలను నిటారుగా ఉంచి.. పైకి చూడటం, గట్టిగా కళ్లు మూయటం లాంటివి చేయాలి.. ఇలా 6-10 సార్లు చేసి చూడండి..ఫలితం కన్పిస్తుంది..

నోరు తెరచి పెదాలను లోపలి ముడవాలి.. తలను పైకెత్తి గడ్డం దగ్గర వేలితో గట్టిగా లాగి పట్టి ఉంచాలి.. నెమ్మదిగా మూయటం , తెరవటం చేయాలి.. ఇలా అయిదారు సార్లు చేశాక పళ్లు కన్పించకుండా నవ్వినట్టుగా చేయాలి.. దీన్ని రోజూ ఐదారుసార్లు చేస్తే సరి.. బుగ్గల దగ్గర సాగినట్టుగా తయారవుతున్న చర్మానికి చెక్ పెట్టేయవచ్చు..

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాల కోసం (నాడి) క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/health1/