గుజరాత్ నుంచి ఏపీకి మత్స్యకారుల తరలింపు

తొలివిడతలో ఏపీ కి చేరిన 887 మంది

shifting fishermens to andrapradesh
moving fishermen’s to andrapradesh

అమరావతి; లాక్ డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. గత కొంతకాలంగా అక్కడే ఉంటూ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటు , అనారోగ్యాల పాలై కొంతమంది మత్స్య కారులు మరణించారు. దీనితో గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్య కారులను సొంత రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలివిడతలో నేడు 12 బస్సులలో 887 మంది ఏపీ కి చేరుకున్నారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 700 మంది, విజయనగరం జిల్లాకు చెందిన 98 మంది, విశాఖకు చెందిన 77 మంది మత్స్య కారులు ఏపీకి చేరుకున్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/telangana/