హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్

chandrababu-file-quash-petition-in-supreme-court

అమరావతిః స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈరోజు, రేపు విచారణ కొనసాగనుంది.