నేడు కర్ణాటక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు

First session of 16th Karnataka Assembly begins, newly elected MLAs take oath

బెంగళూరుః కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశమవుతున్నది . ఈరోజు నుంచి మూడు రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. తొలిరోజైన నేడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. సీనియర్‌ సభ్యుడైన ఆర్‌వీ దేశ్‌పాండ్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ నెల 10న జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ సిద్ధరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకార వేడుకను నిర్వహించారు. సీఎం సిద్ధరామయ్యతో గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఉపముఖ్యమంత్రిగా, మొత్తం 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో డాక్టర్‌ జీ పరమేశ్వర, కేహెచ్‌ మునియప్ప, కేజే జార్జ్‌, ఎంబీ పాటిల్‌, సతీశ్‌ జర్కిహోలి, ప్రియాంక్‌ ఖర్గే, రామలింగారెడ్డి, బీజెడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఉన్నారు.