‘కస్టడీ’ డైరెక్టర్ తో విజయ్..?

తమిళ్ హీరో విజయ్ ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా..? ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా నాగ చైతన్య తో కస్టడీ మూవీ ని డైరెక్ట్ చేసిన ప్రభు..విజయ్ 68 వ చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడు. ఏజిఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌ అఘోరాం ఈ సినిమా ను నిర్మించబోతున్నట్లు విజయ్ తెలిపాడు. ఈ ప్రకటన చూసి విజయ్ అభిమానులు షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం విజయ్..తన 67వ సినిమా ‘లియో’ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీ అక్టోబర్ 19 న విడుదల కాబోతుంది.