రేపటి నుండి ఏపీలో విస్తారంగా వర్షాలు

heavy-rains-telangana

ఏపీ లో రేపటినుండి విస్తారంగా వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తుంది. థాయ్‌లాండ్, అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని రేపటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుపానుగా మారాక దీనికి ‘జవాద్‌’గా నామకరణం చేయనున్నారు.

ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురు వానలు కురిశాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వానలు కురిశాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.