మరోసారి జగన్ తో వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదో..పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు

perni-nani-comments-about-his-political-retirement

అమరావతిః సిఎం జగన్‌ మచిలీపట్నం సభలో సభలో ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తో తనకు చివరి మీటింగ్ అంటూ మాట్లాడారు. మరోసారి జగన్ తో వేదికను పంచుకునే అవకాశం వస్తుందో రాదో అని వ్యాఖ్యానించారు, పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతున్నానని వేదిక పైనే నాని ప్రకటించారు.

రూ.5,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్‌ పోర్ట్‌ పనులకు సీఎం జగన్‌ 2023 మే 22 సోమవారం రోజున శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారత్ స్కౌట్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న పేర్ని నాని ఈ కామెంట్స్ చేశారు. ఈ పబ్లిక్ మీటింగ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపీ బౌలశౌరి తదితర ప్రముఖులు మాట్లాడారు. అయితే దాదాపు ముప్పావు గంట పాటు మాట్లాడిన నాని తన రాజకీయ భవితవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే తనకు జగన్‌తో ఇదే చివరి మీటింగ్ కావచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లోపు వేదికపై నుంచి ఎమ్మెల్సీ రఘురాం తో మరికొందరు ఇక చాలంటూ వెనుక నుంచి వారించారు. కానీ పేర్ని మాత్రం ఆపకుండా ప్రసంగాన్ని కొనసాగించాడు. ఆయన కొడుకును రాజకీయాల్లోకి దింపాలని పేర్ని నాని ఆలోచరనలో ఉన్నారని అందుకే ఈ ప్రకటన చేశారని తెలుస్తోంది.