అనుష్క మూవీ సమ్మర్ లో రాబోతుందట

సూపర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అడుపెట్టిన అనుష్క..ఆ తర్వాత అరుంధతి మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ లో అనుష్క యాక్టింగ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ మూవీ తరువాత అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. లేడి ఓరియంటెడ్ చేయాలంటే అనుష్కే చేయాలనీ అంత ఫిక్స్ అయ్యారు. ఓ పక్క లేడి ఓరియంటెడ్ మూవీ తో పాటు గ్లామరస్ పాత్రలు చేస్తూ అతి తక్కువే టైంలోనే అగ్ర హీరోయిన్ గా మారింది.

ఈ క్రమంలో సైజు జీరో మూవీ చేసి పెద్ద తప్పు చేసింది. ఈ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన ఈమె..ఆ తర్వాత బరువు మాత్రం తగ్గలేకపోయింది. దీంతో ఛాన్సులు లేకుండా పోయాయి. ఈమె నటించిన సైలెన్స్ మూవీ తర్వాత మరో సినిమా లేకుండా పోయింది. దాదాపు రెండేళ్లు గా తెరపై కనిపించకుండా అయిపోయింది. అయితే వచ్చే ఏడాది అనుష్క తెరపై కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ శెట్టి – అనుష్క జంటగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్ సైతం పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. మరి ఆ సినిమా లో అనుష్క ఎలా కనిపిస్తుందో చూడాలి.