వనస్థలిపురంలోని సుబ్బయ్య గారి హోటల్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుబ్బయ్యగారి హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో హోటల్ లో 40మంది వరకు ఉన్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా ఘటనా స్థలానికి వచ్చి మంటల్ని ఆర్పే యత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న 40 మందిని సురక్షితంగా రక్షించారు. నగరంలో లక్షలాది హోటల్స్, ఫుడ్ సెంటర్లు ఉన్నా సుబ్బయ్యగారి హోటల్ కు ప్రత్యేకత ఉంది.

అరిటాకులో భోజనం.. 12 నుంచి 16 రకాల వంటకాలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ హోటల్ కు వెళ్లినవారికి గోదావరి రుచులతో.. సిబ్బంది అత్యంత మర్యాదగా దగ్గరుండి మరి వడ్డిస్తారు. బంధువుల్లా కొసరి కొసరి వడ్డిస్తారు. ఆకలి లేకపోయినా తినాలనిపించే రుచులు సుబ్బయ్యగారి హోటల్ లో ప్రత్యేకత. కూకట్‌పల్లి, మలక్‌పేట, కొండాపూర్‌, అమీర్ పేట, వనస్థలిపురం వంటి పలు ప్రాంతాల్లో సుబ్బయ్యగారి హోటల్ ఉంది.